పిల్లల కోసం పెద్దల కవిత్వం
పిల్లల కోసం పెద్దల కవిత్వం
(పచ్చిమ గోదావరి జిల్లా ,పెదపాడు మండలం,కోర్లమ్మకుంట ,ఎం.పి.పి .స్కూలు వార్షికోత్సవం లో చెప్పిన స్వీయ కవిత-తేది: 18.03.2010)
-శ్రీ 'కాట్రగడ్డ'
పిల్లలం !పిల్లలం !పిల్లలం !
అక్షరాలూ నేర్చుకొనే ఎల్లలం !ఎవరి పిల్లలం!
అందమైన పిల్లలం !మంచి మనసు మల్లెలం!
పిల్లలం! పిల్లలం!మేమంతా బడి పిల్లలం!
కనుల చూసి-చెవుల వినగా
తెలుగు భాష శిక్షితులం ;
మొక్కలపై మక్కువతో
విత్తనాలు వెదజల్లే రక్షకులం!
అమ్మ,నాన్న ,ప్రేమాలోదుగు
మాటలుగా-పాటలుగా,
అక్షరాలూ నేర్చి కూర్చి
పోటిపడి ఆటలాడు పిల్లలం!!
లక్షణ గురువులకై శిష్యులం!
బాలురకు,బాలికలకు స్నేహితులం!
మాబడిలో మార్మోగే నవ్వులం;
గుడిలాంటి మా బడి లో దివ్వెలం!!
మేమంతా తెలుగు తల్లి పిల్లలం
తెలుగు దేశ నలుదిక్కుల
మారడుగు లేయ ఎదుగుచున్న
చదువులమ్మ పోషణలో పిల్లలం!
పిల్లలం! పిల్లలం! పిల్లలం!
ఆంధ్రాక్ష రాల హారతులిడు పిల్లలం!
అందమైన గ్రామాన భారతీయ ముల్లెలం!
పిల్లలం! పిల్లలం!మేమంతా బడి పిల్లలం!
******** ******** ********
(పచ్చిమ గోదావరి జిల్లా ,పెదపాడు మండలం,కోర్లమ్మకుంట ,ఎం.పి.పి .స్కూలు వార్షికోత్సవం లో చెప్పిన స్వీయ కవిత-తేది: 18.03.2010)
"మేమంతా..."
-శ్రీ 'కాట్రగడ్డ'
పిల్లలం !పిల్లలం !పిల్లలం !
అక్షరాలూ నేర్చుకొనే ఎల్లలం !ఎవరి పిల్లలం!
అందమైన పిల్లలం !మంచి మనసు మల్లెలం!
పిల్లలం! పిల్లలం!మేమంతా బడి పిల్లలం!
కనుల చూసి-చెవుల వినగా
తెలుగు భాష శిక్షితులం ;
మొక్కలపై మక్కువతో
విత్తనాలు వెదజల్లే రక్షకులం!
అమ్మ,నాన్న ,ప్రేమాలోదుగు
మాటలుగా-పాటలుగా,
అక్షరాలూ నేర్చి కూర్చి
పోటిపడి ఆటలాడు పిల్లలం!!
లక్షణ గురువులకై శిష్యులం!
బాలురకు,బాలికలకు స్నేహితులం!
మాబడిలో మార్మోగే నవ్వులం;
గుడిలాంటి మా బడి లో దివ్వెలం!!
మేమంతా తెలుగు తల్లి పిల్లలం
తెలుగు దేశ నలుదిక్కుల
మారడుగు లేయ ఎదుగుచున్న
చదువులమ్మ పోషణలో పిల్లలం!
పిల్లలం! పిల్లలం! పిల్లలం!
ఆంధ్రాక్ష రాల హారతులిడు పిల్లలం!
అందమైన గ్రామాన భారతీయ ముల్లెలం!
పిల్లలం! పిల్లలం!మేమంతా బడి పిల్లలం!
******** ******** ********
సౌజన్యం: బాల కళ
ధన్యవాదాలతో
మీ
పొత్తపుగుడి
మీ
- గణేశ్ బెహరా
http://pottapugudi.blogspot.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి